అయ్యయ్యో..గేమ్‌ ఛేంజర్‌ టైటిల్‌ బీజీఎం కూడా కాపీనేనా? మరోసారి దొరికిపోయిన థమన్‌..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఆర్సి 15 . ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను రివిల్ చేశారు చిత్ర బృందం. కాగా ఈ సినిమాకి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. ప్రజెంట్ యూట్యూబ్లో ఈ గేమ్ చేంజర్ టైటిల్ వీడియో సోషల్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది .

మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. మరోవైపు ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న తమన్ కి కూడా మంచి మార్కులే పడుతున్నాయి. అయితే రీసెంట్గా ఈ టైటిల్ బిజిఎం కూడా కాపీ కొట్టాడు అన్న న్యూస్ వైరల్ గా మారుతుంది మనకు తెలిసిందే మొదటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కాపీ రాజా అనే పేరు ఒకటి ఉంది . ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన తమన్.. తన సినిమాలకు సంబంధించిన కొన్ని మ్యూజిక్స్ ని వేరే సినిమాల నుంచి కాపీ కొడతాడు అన్న అపవాద కొన్ని సంవత్సరాలుగా మన వింటూనే ఉన్నాం .

కాగా రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ కూడా కాపీ కొట్టాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . గేమ్ చేంజర్ టైటిల్ వీడియో ట్రెండింగ్ లో ఉన్న సందర్భంగా తమన్ పేరు మరోసారి మారు మ్రోగిపోతుంది. ఈ బిజిఎం కూడా ఓ హిందీ వర్జినల్ సాంగ్ కి కాపీ అంటూ మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ప్రూఫ్ తో సహా వీడియోని బయటపెడుతూ పక్కాగా తమన్ ని ఆడేసుకుంటున్నారు. బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ యోయో హనీ సింగ్‌, ఊర్వసి రౌతేలా కలిసి చేసిన లవ్‌ డోస్‌ సాంగ్‌ని పోలి ఉందంటున్నారు. అయితే హనీ సింగ్‌ మ్యూజిక్‌ కాస్త స్మూత్‌గా వెళితే, థమన్‌ దాని డోస్‌ పెంచాడని, డబుల్‌ డోస్‌ ఇచ్చి ఈ కొత్త బీజీఎం చేశాడని కంపేర్‌ చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . చూడాలి మరి దీనిపై తమన్ ఏ విధంగా స్పందిస్తారో..?

 

Share post:

Latest