శాకుంతలం దొబ్బేస్తే ..సమంత పరిస్ధితి ఏంటి..? లాస్ట్ కి అదే గతి కానుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత ప్రెసెంట్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఆమె ఎంతో కాలం నుంచి వెయిట్ చేసి చేస్తున్న సినిమా శాకుంతలం మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం తమదైన స్టైల్ లో సినిమాను ముందుకు తీసుకెళ్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో సమంత శకుంతలా దేవి పాత్రలో కనిపించబోతుంది . సమంత పక్కన దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు . ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా నిలవబోతోంది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ. ఈ సినిమాలో భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. రీసెంట్ గా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత సినిమాకి మరింత హైప్ ని క్రియేట్ చేసింది .

ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని,, ఈ సినిమాలో వాడిన నగలన్నీ ఒరిజినల్ నగలు అని చెప్పుకొచ్చింది . అయితే సోషల్ మీడియాలో సమంత అంటే పడని కొందరు ఆకతాయిలు సినిమాను ట్రోల్ చేస్తున్నారు . ఇంత కష్టపడి ప్రమోషన్స్ చేస్తున్నావు ..ఆరోగ్యం బాగా లేకపోయినా ఇంత హంగామా చేస్తున్నావు.. ఒకవేళ శాకుంతలం సినిమా ఫ్లాప్ అయితే .. నెక్స్ట్ నీ పరిస్థితి ఏంటి..? ఇప్పటివరకు తెలుగులో మరో సినిమాకి కమిట్ అవ్వలేదు.. శకుంతలం సినిమా నీకు ఫ్లాప్ అయితే మాత్రం తర్వాత గతి ఖుషినే అంటున్నారు జనాలు.

విజయ్ దేవరకొండ హీరోగా శివనిర్వాణ డైరెక్షన్లో సమంత హీరోయిన్గా తెరకెక్కబోతున్న సినిమా ఖుషి . ప్రజెంట్ ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రన్నింగ్ లో ఉంది . ఈ రెండు సినిమాలు తప్పిస్తే సమంత ఖాతాలో తెలుగు సినిమానే లేదు . ఒకవేళ శకుంతల ఫ్లాప్ అయితే మాత్రం తన ఆశలన్నీ ఖుషి పైనే పెట్టుకొని ఉండాల్సి వస్తుంది సమంత అంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు జనాలు . అంతేకాదు కావాలనే తెలుగు ఇండస్ట్రీలో సమంతని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని .. ఆ కారణంగానే సమంతకు ఆఫర్లు ఇవ్వడం లేదంటూ కూడా న్యూస్ వైరల్ గా మారింది. దీంతో సమంత పరిస్థితి అయోమయంగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

 

Share post:

Latest