వారి కారణం వల్లే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదా..!!

టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంతో పలు రికార్డులను సైతం సృష్టించారు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా లెవెల్ లోనే పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ కు సంబంధించి ఏదో ఒక విషయం పెళ్లి గురించి వైరల్ గా మారుతూనే ఉంటుంది.

Prabhas shares a tight knit bond with his family and here are some  heartwarming moments to prove it | PINKVILLA

అయితే తాజాగా మరొకసారి ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ అమ్మాయిలే అంటూ పెద్ద వార్త వైరల్ గా మారుతోంది. కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆ ఇంటి బాధ్యతలన్నీ ప్రభాస్ తీసుకున్నారు.. ఇక కృష్ణంరాజుకు ముగ్గురు కూతుర్లు అయితే ముగ్గురు చెల్లెళ్లకు వివాహం చేయకుండా తాను చేసుకోనంటూ భీష్మించుకు కూర్చున్నట్లు తెలుస్తోంది ప్రభాస్..ఈ విషయంలో శ్యామలాదేవి మాత్రం ప్రభాస్ పై కోప్పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నువ్వు వివాహం చేసుకుంటేనే చెల్లెళ్లకు కన్యాదానం చేయవచ్చు నువ్వు పెళ్లి చేసుకో నాన్న అంటూ శ్యామలాదేవి చాలా బతిమిలాడుతున్నట్లుగా సమాచారం. ప్రభాస్ మాత్రం వారి పెళ్లి చేశాకే నేను వివాహం చేసుకుంటానంటూ దాటివేస్తున్నారు అందువలన చెల్లెల కోసం ప్రభాస్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రభాస్ చెల్లెలు ఒకరు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకు వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ నటించిన చిత్రాలలో ప్రస్తుతం ఆది పురుష్ , సలార్, ప్రాజెక్ట్-k వంటి చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఏడాది ఇందులో రెండు సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గడచిన కొద్ది రోజుల నుంచి ప్రభాస్ ఆరోగ్యం సరిగ్గా లేదని రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి వీటి పైన కూడా ఏ విధమైనటువంటి క్లారిటీ రాలేదు.