మొద‌టి భ‌ర్త నుంచి భూమా మౌనిక ఎన్ని కోట్ల భ‌ర‌ణం తీసుకుందో తెలిస్తే షాకే!?

మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ ఈ నెల 3వ తేదీన‌ భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి వివాహం హైదరాబాద్ ఫిలింనగర్ లోని మంచు ల‌క్ష్మి నివాసంలో వైభ‌వంగా జ‌రిగింది. కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ మూడు ముళ్ల బంధంతో మ‌నోజ్‌, మౌనిక ఒక‌ట‌య్యారు.

మంచు మ‌నోజ్ తో పాటు మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహ‌మే. మౌనిక దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల రెండవ కుమార్తె. ఈమె అసలు పేరు భూమా నాగ మౌనిక. గతం లో ఆమె బెంగళూరు కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త గణేష్ రెడ్డి ని వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. అయితే కుమారుడు పుట్టిన కొన్నాళ్ల‌కే గణేష్ రెడ్డి, మౌనిక మ‌ధ్య మనస్పర్ధలు ఏర్ప‌డ్డాయి.

దాంతో మౌనిక అతనితో విడాకులు తీసుకుంది. ఆమె విడాకులు తీసుకున్న సమయంలోనే భరణంగా మొద‌టి భ‌ర్త నుంచి ఏకంగా రూ. 250 కోట్లు తీసుకుంద‌ని టాక్ ఉంది. ప్ర‌స్తుతం ఐదు సంవ‌త్స‌రాల కొడుకు భూమా మౌనిక ద‌గ్గ‌రే ఉంటున్నాడు. త‌న‌యుడితో హైద‌రాబాద్ లో ఉన్న మౌనిక‌కు మ‌నోజ్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా.. అది ప్రేమ‌గా మారి ఇప్పుడు పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది.