చనిపోయే ముందు వరకు తారకరత్నని దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ..కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది . నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ని ఈ వార్త తీవ్ర విషాదంలోకి నింపేసింది . కాగా గత 23 రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తారకరత్న చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదు . కోమాలోకి వెళ్లిపోయిన తారకరత్నను బ్రతికించడానికి డాక్టర్లు స్థాయి శక్తుల ప్రయత్నించారు. ఫారిన్ నుండి డాక్టర్స్ ను పిలిపించారు . అయినా ఆయనని ఆ దేవుడు కరుణించలేదు . నందమూరి తారకరత్న ప్రాణాలను తీసుకువెళ్లిపోయాడు . ఈ విషాద వార్తతో నందమూరి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.

కాగా ఇలాంటి క్రమంలోనే తారకరత్న ఫాన్స్ నందమూరి కుటుంబం ఆయనను దూరం పెట్టిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు . మనకు తెలిసిందే నందమూరి తారకరత్న ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు . నందమూరి తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి . వీళ్లది ప్రేమ వివాహం .

అలేఖ్య రెడ్డికి ఇదివరకే పెళ్లయింది . అయినా సరే ఆమెతో ప్రేమలో పడిన తారకరత్న ఆమెనే పెళ్లి చేసుకుంటానంటూ ఇంట్లో మొండి పట్టుదల పట్టారు . ఆయన రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నందమూరి ఫ్యామిలీ.. ఆమెను పెళ్లి చేసుకుంటే కుటుంబంలో నుంచి వెలివేస్తామంటూ వార్న్ చేసింది . అయినా కానీ ప్రేమించిన అమ్మాయి కోసం నందమూరి అనే గౌరవాని వదులుకున్నాడు తారకరత్న అంటూ గతంలో వార్తలు వినిపించాయి.

అంతేకాదు ఇప్పటివరకు తారకరత్నకు నందమూరి ఫ్యామిలీ నుంచి దక్కాల్సిన ఏ గౌరవం అందనివ్వలేదు అంటూ కూడా ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏ ఫంక్షన్ అయినా ..ఏ మీటింగ్ అయినా.. తారకరత్న ను దూరం పెట్టే వాళ్ళని తలుచుకొని బాధపడుతున్నారు . ఆఖరికి ఆయన చనిపోయే ఓ నెల రోజులు ముందు కూడా తారకరత్న ని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టిందని.. పాదయాత్రలో పడిపోయి.. క్రిటికల్ కండిషన్ గా ఉంది అని తెలిసినప్పుడే హాస్పిటల్ కి నందమూరి కుటుంబ సభ్యులు తరలివచ్చారని ..

అంతవరకు తారకరత్నని నందమూరి ఫ్యామిలీ కలిసిన సందర్భాలు లేవంటూ గుర్తు చేసుకుంటున్నారు . ఈ విధంగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కారణంగా నందమూరి ఫ్యామిలీ నుండి తారకరత్నను వెలివేశారు. ఇప్పుడు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు . ఈ విషయం తలుచుకొని తలుచుకొని ఫ్యాన్స్ బాధపడుతున్నారు . తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డిని ఆపడం ఎవరి తరం కావడం లేదు . తారకరత్న పార్ధవ దేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!!