బోయపాటి సినిమాలో నటించబోతున్న ప్రిన్స్..!!

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరోని విలన్లని చాలా స్టైలిష్ గా చూపిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఈయన సినిమాలు కూడా భారీ హిట్ అవుతూ ఉంటాయి. ఈయన దర్శకత్వంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని కూడా అందుకున్నారు. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా భారీగానే సంపాదిస్తూ ఉంటాయి. ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేని తో కలిసి ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం కూడా మాస్ మసాలా మూవీ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం.

Talented actor Prince is Antagonist in Ram and Boyapati srinu film | -  Boyapti Srinu, Prince, Ram Pothineni, Tollywood, Villain Roleఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాలో విలన్ గా ఒక యువ హీరొ నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన సీనియర్ హీరోలను ఎంచుకుంటారని అందరూ అనుకున్నారు. గతంలో కూడా జగపతిబాబు ,శ్రీకాంతులను విలన్ గా మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు రామ్ కోసం ఒక హీరోతో విలన్ వేషం వేయించనున్నారు. అత్యధిక భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రిన్స్ విలన్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో ప్రిన్సిపల్ చిత్రాలను సైడ్ క్యారెక్టర్లలో హీరోగా కూడా నటించారు.

Talented actor Prince is Antagonist in Ram and Boyapati srinu film | -  Boyapti Srinu, Prince, Ram Pothineni, Tollywood, Villain Roleకానీ ఏది కూడా తనకు సక్సెస్ ఇవ్వలేదు.అందుచేతనే ఈసారి విలన్ గా డిఫరెంట్ డిజైనర్ గా బోయపాటి సినిమాలో రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరగబోతుందని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమా తెలుగు తెరకు పరిచయమైన ప్రిన్స్ ఆ తర్వాత బస్ స్టాప్ నేను శైలజ సినిమాలతో నటుడుగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు. మరి విలన్ గా సక్సెస్ అవుతారమో చూడాలి మరి.