మారుతి మూవీకి ప్ర‌భాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవ‌డం లేదా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ లోకేషన్ నుంచి ఓ పిక్ కూడా బయటకు వచ్చి నెట్టింట తెగ‌ హల్చల్ చేసింది. ఇక‌పోతే ఈ సినిమాకు ప్రభాస్‌ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.

బాహుబలి విడుదల తర్వాత ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల నుంచి 150 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కానీ మారుతి సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అయితే రిలీజ్ తర్వాత సినిమా సక్సెస్ బట్టి అందులో కొంత‌ షేర్ ని ప్ర‌భాస్ తీసుకుంటాడ‌ట. ఈ విధంగా మేక‌ర్స్ తో ప్ర‌భాస్ అగ్రిమెంట్ చేసుకున్నాడ‌ని అంటున్నారు.