టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్, రానా దగ్గుబాటి లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిన ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎన్నో రికార్డులను నెలకొల్పింది.
ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా నటించి ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. భల్లాలదేవగా రానా కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాగే బాహుబలి సినిమాలో బాగా హైలెట్ అయిన మరో పాత్ర కట్టప్ప ఒకటి. కట్టప్పగా సత్యదేవ్ అదరగొట్టేశాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతోనే బాహుబలి రెండో భాగం మొదలవుతుంది.
అయితే నిజానికి కట్టప్ప పాత్రకు ఫస్ట్ ఛాయిస్ సత్యదేవ్ కాదట. ఓ స్టార్ హీరో కట్టప్ప పాత్ర నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్. రాజమౌళి కట్టప్ప పాత్ర కోసం ముందుగా మోహన్ లాల్ ను అనుకున్నాడట. అయితే మోహన్ లాల్ మాత్రం పాత్ర నచ్చక రిజెక్ట్ చేశాడట. ఇక ఫైనల్ గా కట్టప్పగా సత్యరాజ్ ను తీసుకున్నారట. ఏదేమైనా బాహుబలి చూసిన తర్వాత కట్టప్పగా మరొకరిని ఊహించుకోలేము. ఎందుకంటే, అంతలా సత్యదేవ్ తన నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేశాడు.