త‌మ‌న్నాను ముద్దుగా ప్రియుడు విజ‌య్ వ‌ర్మ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..?

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పీక‌ల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి.

ఆ త‌ర్వాత ప‌లు మార్లు వీరిద్ద‌రూ జంట‌గా క‌నిపించ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది. ఇక తాజాగా విజ‌య్ వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `ద‌హాడ్` వెబ్‌ సిరీస్ బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్ అయ్యింది. ఈ సిరీస్‌కు ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మంచి రెస్పాన్స్ వ‌చ్చిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో విజ‌య్‌ పోస్ట్ పెట్టాడు. అయితే అత‌డి పోస్ట్‌ను త‌మ‌న్నా త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.

ప్రియుడు విజ‌య్ కు మ‌రియు మిగ‌తా టీమ్ కు త‌మ‌న్నా ప్ర‌త్యేకంగా విషెస్ తెలిపింది. దీంతో విజ‌య్ వ‌ర్మ `థ్యాంక్స్‌` అంటూ త‌మ‌న్నాకు రిప్లై ఇచ్చారు. అయితే ఫ్యాన్స్ అంతా తమన్నాని ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. కానీ, ప్రియుడు విజ‌య్ వ‌ర్మ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..? టమాటో అని. అవును, తాజాగా పోస్ట్ లో `థ్యాంక్స్ టమాటర్` అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో విజ‌య్ తమన్నాని ముద్దుగా `టమాటర్` అని పిలుస్తాడ‌ని తేలిపోయింది.