ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే . చిన్న డైరెక్టర్గా తన కెరియర్ను ప్రారంభించిన రాజమౌళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకొని .. మన తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ దేశాలకు పాకేలా చేశాడు . దీని అంతటికి కారణం ఆయన తెరకెక్కించిన బాహుబలి అనే సినిమా అని అందరికీ తెలిసిందే . అప్పట్లో పాన్ ఇండియా సినిమా అంటే అందరూ ఒక విధంగా చూసేవారు. కానీ అలాంటి పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసింది దర్శకుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి వల్లే అన్నది వాస్తవం.
ఇండియన్ సినిమా భాషా – బేధాలు తొలగించిన రాజమౌళిని ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఉండే దిగ్గజ దర్శకులు ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు . అంతర్జాతీయంగా కూడా రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది స్టీవెన్ స్పిల్ బర్గ్ , జేమ్స్ కెమెరూన్ లాంటి మహా మహులే జక్కన్నను పొగిడేస్తూ ..ఆయన టేకింగ్ ఫిదా అయ్యారు. కాగా ఇటీవల చెన్నైలో జరిగిన డైరెక్టర్ సమిట్లో రాజమౌళిని మణిరత్నం – సుకుమార్ లాంటి స్టార్ దర్శకులు పొగిడేశారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ డైరెక్టర్ రాజమౌళిని ఓ రేంజ్ లో పొగడేసారు.
మరి ముఖ్యంగా కోట్లాదిమంది ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం కూడా రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశారు . “మీ అందరికీ తెలుసు పోనియన్ సెల్వన్ సినిమా తెరకెక్కించడానికి నేను ఎన్నో ఏళ్లు ఎదురు చూసాను .. నిజంగా చెప్తున్నాను బాహుబలి చిత్రం ఏనాడైతే వచ్చిందో.. అది చూసే నేను పోనియన్ సెల్వన్ సినిమా రెండు పార్టులుగా తెరక్ర్క్కించాలని భావించాను. ఓ రకంగా చెప్పాలంటే రాజమౌళి తరకెక్కించిన బాహుబలి సినిమాయే.. నా కళ్ళు తెరుచుకునేలా చేశాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలను కూడా జనాలు ఆదరిస్తారు అని తెలుసుకున్నాను” అంటూ రాజమౌళి ని ఓ రేంజ్ లో పొగిడేసారు.
నిజానికి రాజమౌళితో కంపేర్ చేస్తే మణీరత్నం కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు .. ఈయన సినిమాలంటే స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోతారు . ఇప్పటికీ ప్రభాస్ మణిరత్నం డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా చేయలేకపోయాను అని బాధపడతాడు . అలాంటి ఆయన రాజమౌళిని ఈ రేంజ్ లో పొగడడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా నిన్ను చూసి నేను డైరెక్షన్ నేర్చుకున్నాను అన్న పదం మణిరత్నం ఫ్యాన్స్ కి వెనడానికి ఇబ్బందికరంగా ఉంది . అందుకే కొందరు జనాలు మణిరత్నం.. రాజమౌళి భజన చేస్తున్నాడని తద్వారా పాపులారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు అంటూ మణిరత్నంని ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క మంచి పని చేస్తే ఎవరినైనా ప్రశంసించాలి అది మంచి వాడి లక్షణం అందుకే మణిరత్నం చేస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు..!!