ఇదెక్కడ ఫ్యాషన్ అయ్యా బాబోయ్.. ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని వచ్చిందా ఏంటి..??

దిశా పటాని ‘లోఫర్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ అమ్మడు ఆ సినిమాలో తన అందాలను విపరీతంగా ఆరబోసి, వరుణ్ తేజ్ తో బీభత్సమైన కెమిస్ట్రీ పండించి బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా సినిమాల్లోనే కాకుండా బయట కూడా తన గ్లామరస్ అందాలతో చెలరేగిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ ఇన్నర్‌వేర్ కంపెనీ కాల్వీన్ కేర్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా దిగిన ఫొటోస్ కుర్రాళ్ల గుండెలో గిలిగింతలు పుట్టిస్తున్నాయి. దిశా తన బికినీ వేర్ ఫొటోలతో ఎవరికి నిద్రపట్టకుండా చేస్తుంది.

ఇక మొన్న ముంబై లో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అధ్వానిల రెసెప్షన్ వేడుక జరిగింది. ఆ వేడుకకి చాలా మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. అయితే అందరూ చీరలు, లెహంగాలు లాంటి సంప్రదాయా దుస్తులలో రెసెప్షన్ కి వచ్చి సందడి చేస్తే దిశా పటాని మాత్రం ఆమె అందాలు అందరికి కనిపించేలా మోడ్రెన్ డ్రెస్ లో వేడుకకి హాజరైయింది. ఎద అందాలను కనపడేలా డీప్ నెక్ బ్లౌజ్, థాండర్ తాయ్స్ ని చూపిస్తూ ఉన్న హాఫ్ కట్ స్కర్ట్ వేసుకొని గ్లామర్ పంట పండించింది.

సంప్రదాయ వేడుకలో దిశా డ్రెస్సింగ్ స్టైల్ చూసి కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ఫ్యాషన్ రా నాయనా అని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమందేమో దిశా కి కొత్త స్టైలిస్ట్ కావాలి అంటుంటే మరి కొంతమందేమో ఇది సంప్రదాయ వేడుక దిశా, క్లబ్ వేడుక కాదు అని కామెంట్ చేసారు. ఇంకొందరేమో ఇదెక్కడ ఫ్యాషన్ అయ్యా బాబోయ్.. ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని వచ్చిందా ఏంటి? అని అవాక్కవుతున్నారు.