బాక్సాఫీస్ వ‌ద్ద `సార్‌` సెన్సేష‌న్‌.. 2 రోజుల్లో ధ‌నుష్ ఎంత రాబ‌ట్టాడంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రం `సార్‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ గా న‌టించింది. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో ధ‌నుష్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ క‌లెక్ష‌న్స్ ను రాబ‌డుతున్నాడు. తొలి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజుకు ఎక్స్ లెంట్ జోరును చూపించింది. ఫ‌స్ట్ డే రూ. 2.65 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సార్‌.. రెండో రోజు ఏకంగా రూ. 3.15 కోట్ల షేర్ తో దుమ్ము దుమారం రేపింది.

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అంటే ఈ సినిమా తెలుగులో క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 20 లక్షల షేర్ ని అందుకుంటే సరిపోతుంది ఇక ఏరియాల వారీగా సార్ 2 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 2.34 కోట్లు
సీడెడ్: 77 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 74 ల‌క్ష‌లు
తూర్పు: 57 ల‌క్ష‌లు
పశ్చిమ: 22 ల‌క్ష‌లు
గుంటూరు: 49 ల‌క్ష‌లు
కృష్ణ: 42 ల‌క్ష‌లు
నెల్లూరు: 25 ల‌క్ష‌లు
—————————————
ఏపీ+తెలంగాణ‌= 5.80 5కోట్లు(10.54 గ్రాస్‌~ గ్రాస్‌)
—————————————