బుల్లితెర పైన సెటిల్ అయినా స్టార్ కమెడియన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ కృష్ణ భగవాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ కృష్ణ భగవాన్ కామినేషన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి.అలాగే అల్లరి నరేష్, కృష్ణ భగవాన్ కాంబినేషన్లో కూడా పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఇలా ఎంతోమంది నటులతో సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నారు కృష్ణ భగవాన్. కొన్ని చిత్రాలలో హీరోగా డైరెక్టర్ గా కూడా మారి తెరకెక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గడంతో బుల్లితెర పైన కామెడీ షో తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

Krishna Bhagavaan - Wikipedia
ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆయన కామెడీ షోకి జడ్జిగా మారడంతో మరింత క్రేజీ పెరిగిందని చెప్పవచ్చు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వాటికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కేవలం కమెడియన్ గానే కాకుండా.. జడ్జిలుగా నాగబాబు,రోజా ఎంత పాపులర్ అయ్యారో కృష్ణ భగవాన్ కూడా అంతే పాపులర్ సంపాదించారు. ముఖ్యంగా ఈ షోలో వేసే తన కామెడీ పంచ్ డైలాగులతో ప్రతి ఒక్కరీని కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నారు కృష్ణ భగవాన్. తన కామెడీ టైమింగ్ కృష్ణ భగవాన్ జబర్దస్త్ కి పర్మినెంట్ జడ్జిగా మారిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం అప్పుడప్పుడు మరొక జడ్జ్ ఇంద్రజ ప్లేస్ లో కుష్బూ వస్తున్న కృష్ణ భగవాన్ మాత్రం అక్కడే ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. సినిమాలలో నటించకపోయిన కృష్ణ భగవాన్ కు జబర్దస్త్ అనేది ఒక మంచి అవకాశం వంటిదని చెప్పవచ్చు. తనకున్న కామెడీ ఎక్స్పీరియన్స్ తో ఈ షోని ముందుకు తీసుకు వెళ్తున్నారు కృష్ణ భగవాన్. అయితే జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ వెళుతున్నప్పటికీ జబర్దస్త్ ను నిలబెట్టేందుకు మల్లెమాల సంస్థ తెగ కష్ట పడుతోంది.