`శాకుంత‌లం`లో స‌మంత ధ‌రించిన న‌గ‌ల ధ‌ర తెలిస్తే మ‌తిపోతుంది

య‌శోద వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం స‌మంత నుంచి రాబోతున్న మ‌రో పాన్ ఇండియా చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వ‌హించాడు. పౌరాణిక నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న అద్భుత‌మైన దృశ్య‌కావ్య‌మిది.

మ‌హాభార‌తంలోని దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో దుష్యంత మహారాజుగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్, శ‌కుంత‌ల‌గా స‌మంత క‌నిపించ‌బోతున్నారు. మోహ‌న్ బాబు, గౌత‌మి, సుబ్బ‌రాజు త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ వ‌రుస అప్డేట్స్ తో సినిమాపై హైప్ ను పెంచుతున్నారు.

 

ఇక‌పోతే ఈ సినిమాలో సమంత ధరించిన చీర, నగలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సమంత పోషించిన క్యారెక్టర్ కోసం హైదరాబాద్‌కి చెందిన వసుంధర డైమండ్ రూఫ్ వారు ప్రత్యేకంగా నగలు డిజైన్ చేశారట. అప్పట్లో నగలు ఎలా ఉండేవో అలానే ఈ న‌గ‌ల‌ను త‌యారు చేయించార‌ట‌. `శాకుంత‌లం`లో స‌మంత ధ‌రించిన న‌గ‌ల ధ‌ర తెలిస్తే మ‌తిపోతుంది. ఎందుకంటే, ఈ నగ‌ల కోసం మేక‌ర్స్ ఏకంగా రూ. 93 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. అలాగే ఈ సినిమా కోసం సామ్ ఏకంగా 30 కిలోల బరువుండే శారీ కట్టుకోగా.. ఆ చీరతో ఏడు రోజుల పాటు షూట్ చేశారట.