ఆ ఒక్క కారణంతో ఎన్టీఆర్ ని పక్కన పెట్టిన రష్మిక… కళ్లు నెత్తికెక్కడం అంటే ఇదే..!

టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మిక మందన్న‌ ముందు వరుసలో ఉంటారు. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొని వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక తాజాగా గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ అందుకుని సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా వరుస‌ సినిమాలు చేస్తూ మరో లెవల్ కు వెళ్ళింది.

అయితే ఇప్పుడు రష్మికపై ఓ ఇంట్రెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే రీసెంట్‌గా ఎన్టీఆర్ 30 వ సినిమాకు హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేసినట్టు టాక్ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ రష్మిక వద్దకు వచ్చినప్పుడు.. ఈ ముద్దుగుమ్మ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అడిగినట్లు తెలుస్తుంది. దాదాపు రూ. 6 కోట్లుకు పైగా రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసిందట. ఇక ఈ సినిమా మేకర్స్ అంత మొత్తం ఇవ్వడానికి ఒప్పుకోలేదట. రష్మిక సైతం ఏమాత్రం వెనక్కి తగ్గలేదట నిర్మొహమాటంగా ఎన్టీఆర్ 30వ సినిమాను రిజెక్ట్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Rashmika Mandanna to star in Jr NTR and Trivikram Srinivas's film? - India  Today

దీంతో ఈ చిత్ర యూనిట్ రష్మికకు బదులుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ను ఈ సినిమాకు ఎంపిక చేశారని… దాదాపు ఆమె హీరోయిన్ గా ఫైనల్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ విషయం తెలిసిన రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమెను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కేవలం రెమ్యునరేషన్ కోసం ఎన్టీఆర్ 30 వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను వదులుకొని తప్పు చేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెడుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Latest