నాలుగవ పెళ్లికి కూడా సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ముఖ్యంగా ఈయనను చూస్తేనే చాలు పూనకంతో ఊగిపోయే అభిమానులు కూడా ఉన్నారు. ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే చాలు ఇక అభిమానులకు పండగే.. థియేటర్ల వద్ద రాత్రి నుంచి హడావిడి మొదలవుతుంది. సినిమా డిజాస్టర్ టాకు తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి విజయం సాధిస్తుంది . దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ లో ఏ విధంగా అయితే పాపులర్ అయ్యాడో వ్యక్తిగత విషయాల్లో కూడా అంతకుమించి పాపులర్ అయ్యాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన మొదటి భార్య నందినీకి విడాకులు ఇచ్చి.. హీరోయిన్ రేణూ దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికీ సంతానం కలిగిన తర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్న లెజినోవా ను మూడో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.

అయితే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుండగా పవన్ కళ్యాణ్, అన్న లెజినోవా విడిపోతున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని, ఈ క్రమంలోని మూడవ భార్యకు పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అనే వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నప్పటికీ.. వైసీపీ సోషల్ మీడియా పనేనని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేణు స్వామి కూడా పవన్ కళ్యాణ్ త్వరలో నాలుగో పెళ్లి చేసుకుంటారు అని బిగ్ బాంబు పేల్చారు. అది ఎప్పుడైనా జరగవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.