మరోసారి ప్రభాస్ తో అనుష్క.. డార్లింగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అప్డేట్..పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏది అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ – అనుష్క పెళ్లి మేటర్. సంవత్సరాలు గడుస్తున్నా ..కాలాలు మారుతున్న వీళ్ళ ప్రేమ వీళ్ళ పెళ్లిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు పెళ్లి చేసుకుంటారని.. గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మనకు తెలిసిందే ప్రభాస్ – అనుష్క జంట తెరపై ఎంత చూడముచ్చటగా ఉంటుందో …

ఈ జంట చూసిన ఎవరైనా సరే నిజమైన భార్యాభర్తలు అని అనుకోక తప్పదు . కాగా ఇప్పటికే పలు సినిమాల్లో కలిసి నటించి మెప్పించిన ఈ జోడి త్వరలోనే మరోసారి జంటగా తెరపై కనబడుతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకున్న స్టార్ హీరో ప్రభాస్.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లోనే అన్ని సినిమాలను తెరకెక్కిస్తున్నారు . ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రం స్పిరిట్ సినిమాలో అనుష్క ను హీరోయిన్గా నిర్మాతలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది .

సోషల్ మీడియాలో వీళ్ళకి ఉండే క్రేజ్ ఆధారంగా నిర్మాతలు, డైరెక్టర్లు..ఈ డెసిషన్ తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి . అర్జున్ రెడ్డి ఇలాంటి క్లాస్ – మాస్ – యాటిట్యూడ్ సినిమాను తీసిన డైరెక్టర్ సందీప్ వంగా ఈ సినిమాను తెరకెక్కించబోతుండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు. ఈ సినిమాలో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది..!!