మెగా వర్సెస్ అల్లు వార్.. యుద్ధానికి సై..!

సంక్రాంతి పండగ వస్తుందంటేనే కోడిపందాలతో పాటు కొత్త సినిమాల జాతర కూడా మొదలవుతుంది. ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చయి.. ఇక ఇందులో ప్రధానంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘనవిజయం అందుకున్నారు. వీటితోపాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి.

Ram Charan and Allu Arjun pose for their Christmas gathering

ఈ సంక్రాంతి తర్వాత కూడా ఈ సంవత్సరం భారీగానే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇక ఇప్పుడు 2024 సంక్రాంతిలో కూడా గట్టి పోటీ తప్పదనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంక్రాంతికి ఇద్దరు మెగా హీరోలు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. వారు ఎవరంటే రామ్ చరణ్ మ‌రియు అల్లుఅర్జున్..వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప2.. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలవగా.. ఈ సినిమాని 2024 సంక్రాంతికి విడుదల చేయాలని మైత్రి మూవీస్ భావిస్తుందట.

సరిగ్గా అదే సీజన్ లో రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాని కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి తమ సినిమా ఉండేలా మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సంవత్సరం రెండు సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు..ఆ రెండు కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే 2024 సంక్రాంతికి ఓ సినిమాను ప్రేక్షకులు ముందు తీసుకురావాలని భావిస్తున్నారట. ఆ సమయానికి పుష్ప2 సినిమాని కంప్లీట్ చేస్తే.. వచ్చే సంక్రాంతికి బన్నీ- చరణ్ బాక్స్ ఆఫీస్ వార్ చూసే అవకాశం ఉంటుంది.