ట్రోల్స్ కి గురవుతున్న జబర్దస్త్ రీతూ చౌదరి..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే వారంతా ఎక్కువగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని తెగ ఉపయోగిస్తున్నారు. దీంతో పాపులారిటీ సంపాదించిన వారిలో జబర్దస్త్ రీతు చౌదరి కూడా ఒకరు. ఇక గతంలో కూడా పలు సీరియల్స్ లో కూడా నటించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు యాంకర్ రీతు చౌదరి విషయంలో కూడా ప్రస్తుతం ట్రోల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే రీతూ చౌదరి తండ్రి ఈ మధ్యనే మరణించారు. గుండెపోటుతో అతను మరణించినట్లుగా స్వయంగా తానే తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి తెలియజేసింది.

జబర్ధస్త్ రీతూ చౌదరి హాట్ వీడియో వైరల్: తండ్రి చనిపోయిన వారానికే ఇలాంటివా!  | Jabardasth Rithu Chowdary Latest Video Goes Hot Topic in Social Media -  Telugu Filmibeat

నాన్న నువ్వు లేకుండా నేను ఉండలేను నీ కూతురు దగ్గరకు తిరిగిరా.. నువ్వు నాకు దూరం అవుతానని ఊహించలేనని అంటూ పలు ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది దీంతో ఆమెను ఓదార్చే పనిలో పడ్డారు అభిమానులు ,నెటిజన్లు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా తండ్రి చనిపోయిన వారం రోజులు కాకుండానే ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం మొదలుపెట్టింది. జనవరి 24న రీతూ చౌదరి తన తండ్రి మరణ వార్తను తెలియజేస్తూ ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ పెట్టి వారం రోజులు కాకుండా చీరలో చేసిన గ్లామర్ ఫోటో సూట్లను షేర్ చేసి.. ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య అనే సినిమాలోని పాటలను లిరిక్స్ తో షేర్ చేసింది.

ఇక దీంతో నేటిజన్లు ఇమేపై ట్రోల్ చేసే పనిలో పడ్డారు. సిగ్గుమాలిన దాన కనీసం పెద్ద కార్యమయ్యే వరకు కూడా ఆగలేదు ..వెంటనే మొదలు పెట్టేసావు కదూ అంటూ గోరంగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈమె పైన పలు రకాలుగా ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)