ఓరి దేవుడా.. `ఓజీ` లాంఛింగ్ ఈవెంట్ లో ప‌వ‌న్ ధ‌రించి వాచ్ ఖరీదు అన్ని ల‌క్ష‌లా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే నిన్న ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ జ‌రిగింది. `దే కాల్ హిమ్‌ ఓజీ` అనే వార్కింగ్ టైటిల్ తో హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని ఘ‌నంగా ప్రారంభించారు.

 

ఈ లాంఛింగ్ వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ హుడీ, జీన్స్ ధ‌రించి స్టైలిష్ లుక్ లో అంద‌రినీ ఎట్రాక్ట్ చేశారు. అలాగే ప్ర‌ముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు, కె ఎల్. నారాయణ, కెఎల్ దామోదర ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్.. ముఖ్య అతిథులుగా హాజరై యూనిట్ కు శుభాకాంక్షలు అందించారు.

ఇక‌పోతే `ఓజీ` లాంఛింగ్ ఈవెంట్ లో ప‌వ‌న్ ధ‌రించి వాచ్ ఖ‌రీదు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పవన్ వాచ్ ధర తెలిస్తే ఓరి దేవుడా అంతా అనకుండా ఉండ‌లేరు. పనేరాయ్ అనే ప్రముఖ కంపెనీకి చెందిన వాచ్ ను ప‌వ‌న్ ధ‌రించారు. అయితే దీని ధ‌ర అక్ష‌రాల‌ రూ. 13.52 లక్షలు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాక్ అయిపోతున్నారు.