అలా చేసి కొన్ని కోట్లు కోల్పోయాను.. అంటున్న నటి సుధ..!!

తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుధ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో పాత్రలలో ఏమే ఒదిగిపోయి నటించింది.ముఖ్యంగా ఎంతోమంది నటీనటులకు అమ్మగా కూడా నటించింది. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు ఉండగలమని డైరెక్టర్ బాలచందర్ సూచించడంతో ఆమె హీరోయిన్ల కాకుంటే సైడ్ క్యారెక్టర్లలోని సెటిల్ అయిందట. అలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె తమిళనాడులోని శ్రీరంగంలో మంచి స్థితి మంతులు కుటుంబంలో పుట్టిందట. సుధ తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది.

ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకుందామనుకున్న నటి సుధా.. కానీ అలా జరగడంతో | actress  sudha most emotional words about hero uday kiran uday kiran, sudha , most  emotioanl words, tollywood, chalapathi rao - Teluguఇక ఈమె నటన కూడా అచ్చం తెలుగు అమ్మాయిల ఉండడంతో.. ఇమే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎంతోమంది ప్రోత్సహించారు. అలా అల్లు రామలింగయ్య గారి సలహాతో తెలుగుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి సొంతంగా సినిమాలకు డబ్బింగ్ చెప్పుకున్నారని తెలియజేస్తోంది. ఈ విధంగా ఆమెకు ఎక్కువగా సినిమాలలో అవకాశాలు వచ్చాయని తెలుపుతోంది. వరుసగా సినిమా అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయారని సుధ తెలుపుతోంది. ఇక డబ్బు కూడా బాగా సంపాదించానని సినిమాలో ఒక వెలుగు వెలిగిన ఈమె తన నిజ జీవితంలో మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొందని తెలుపుతోంది.

ఢిల్లీలో హోటల్ బిజినెస్ చేయడం వల్ల తను ఆర్థికంగా చాలా నష్టపోయానని తెలుపుతోంది. అలాగే కొందరు నమ్మిన వాళ్లు కూడా తనని నిండా ముంచేశారని తెలియజేసింది. భర్త కూడా ఆమెను వదిలేసి ఫారెన్ వెళ్ళిపోయాడని..కుమారుడు విదేశీ అమ్మాయిని వివాహం చేసుకోవడంతో అతనితో కూడా సంబంధాలు తెగిపోయాయని తెలుపుతోంది. చిన్న వయసులోనే తల్లి మరణం, పెద్దయ్యాక తండ్రి క్యాన్సర్ తో మరణించడం ఇలా నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా కనీసం తనతో మాట్లాడాలని తెలుపుతోంది. ఇలా తన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని అవన్నీ ఒక మంచి గుణపాఠంలో ఉన్నాయని తెలియజేస్తోంది సుధ.