బాలయ్య- పవన్ అదిరిపోయే సినిమా.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ లో రెండు సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలయ్య ఎలాంటి సినిమా చేసిన ప్రేక్షకులను మెప్పిస్తుందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలయ్య అన్ స్టాపబుల్‌గా అదరగొడుతున్నాడు. ఆహా ద్వారా బాలయ్య వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టపబుల్ షో తో తనలోని కొత్త బాలకృష్ణను అభిమానులకు పరిచయం చేశాడు.

దీంతో బాలయ్య క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళింది. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి గా వచ్చి అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు గోపీచంద్ మలినేని పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ తో బాలయ్య- గోపీచంద్ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ ఇంటర్వ్యూలో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Dalapathi (1991) | Radio Times

టాలీవుడ్ లో కూడా మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ గత కొంతకాలంగా నడుస్తుంది. ‘ఇక ఇప్పుడు ఈ ట్రెండ్ లోకి టాలీవుడ్ లోనే ఇద్దరు మాస్ హీరోలతో కలిసి సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు’. ఇక ఆ సినిమా కూడా ‘కోలీవుడ్‌లో రజనీకాంత్, మమ్ముట్టి హీరోలుగా వచ్చిన దళపతి సినిమాను ఆ ఇద్దరి హీరోలతో కలిసి రీమేక్ చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు’.

Pawan Kalyan to shoot for Balakrishna's Unstoppable tomorrow

ఇంతకీ ఆ ఇద్దరి హీరోలు మరెవరో కాదు ‘బాలకృష్ణ- పవన్ కళ్యాణ్’. ఈ ఇద్దరి హీరోలతోనే ‘దళపతి’ సినిమాను రీమేక్ చేయాలని ఉందని గోపీచంద్ మలినేని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక ‘ఆ సినిమాలో మమ్ముట్టి క్యారెక్టర్ బాలకృష్ణకు, రజనీకాంత్ క్యారెక్టర్ ను పవన్ చేస్తే బాగుంటుందని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు’. అవకాశం కుదిరి ఈ ఇద్దరు హీరోలు ఛాన్స్ ఇస్తే మాత్రం ఈ సినిమాను కచ్చితంగా వారితో తెరకెక్కిస్తానని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.