తమ అభిమాన హీరోలను తెరపై ఎలా చూస్తే బాగుంటుందో వారి అభిమానులకు బాగా తెలుసు. అ అభిమానులే దర్శకులుగా మారి.. అది కూడా వారు ఎంతగానో ఇష్టపడే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా ? చూపిస్తాడో మనం మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోగా కమలహాసన్ నటించాడు. కమల్ వీరాభిమాని అయిన లోకేష్ కనగరాజ్ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఇక ఈ సినిమా విడుదలై కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎన్నో సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు విజయాల దాహం తీర్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అభిమానులే దర్శకులుగా మారి తమ ఇష్టమైన హీరోల సినిమాలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ బాబీ చిరంజీవికి ఎంతో వీరాభిమాని.. డైరెక్టర్ కాకముందు చిరంజీవి ఫ్యాన్ అసోసియేషన్‌లో మెంబర్‌గా కూడా పనిచేశాడు.
అంత వీరాభిమాని అయిన బాబి ఇష్టమైన హీరోను డైరెక్ట్ చేసే అవకాశం వాల్తేరు వీరయ్య సినిమాతో లభించింది. దీంతో చిరంజీవిని ఎలా చూస్తే బాగుంటుందో అలాంటి అన్ని హంగులతో వాల్తేరు వీరయ్య సినిమాను బాబి రూపొందించాడు. ఇక మరో యువ దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని. గబ్బర్ సింగ్ సినిమా విడుదల సమయంలో స్టూడెంట్ గా ఉన్న సుజిత్ థియేటర్లో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
అలాంటి వీరాభిమాని అయిన సుజిత్ ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ను ఎలా ? చూస్తే అభిమానులకు నచ్చుతుందో అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లో లో పవన్ ని చూపించేందుకు సుజిత్ సిద్ధమవుతున్నాడు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావు పూడికి కూడా బాలకృష్ణ అంటే ఎంతో అభిమానం. తొలి సినిమా పటాస్ విడుదలైనప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా చేసేందుకు అనిల్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే కొన్నిసార్లు అనిల్ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పలేదు.. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా అనిల్ మంచి కథతో బాలకృష్ణతో ఓకే చెప్పించుకుని ప్రస్తుతం ఆ కథను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే పవర్ఫుల్ యాక్షన్ సినిమాతో అనిల్ రావుపూడి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక అభిమానులే దర్శకులుగా మారితీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.