తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ ఎంతోమంది ఎంట్రీ ఇస్తున్నారు. అందులో హీరోయిన్ నందిని రాయ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. మొదటిసారి ఈ ముద్దుగుమ్మ 040 చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఖుషి ఖుషీగా, మాయ, మోసగాళ్లకు మోసగాడు, శివరంజని వంటి చిత్రాలలో నటించింది. కానీ ఇవన్నీ పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయట. దింతో హీరోయిన్గా రాణించలేకపోవడంతో.. నందిని హీరోయిన్ల రేసులో కాస్త వెనకబడిందని చెప్పవచ్చు. దీంతో తమిళ్, మలయాళం, హిందీ వంటి చిత్రాలలో నటించిన అక్కడ కూడా ఇమే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎంత సీరియస్ గా ప్రయత్నించినా కూడా సక్సెస్ కాలేకపోయినట్లు తెలుస్తోంది.
ఇక దీంతో చేసేది ఏమీ లేక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బాగ్ సాలే , గాలి వాన వంటి చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. వీటిపై పెట్టుకున్న ఆశలు కూడా ఒమ్ము అయినట్లుగా కనిపిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ లో మొదట్లో ఎన్నో సినిమాలలో నటించాను కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో చాలా కృంగిపోయానని తెలియజేస్తోంది. దీంతో సుసైడ్ కూడా చేసుకోవాలనుకున్నదట నందిని రాయ్. ఒకదాని వెంట మరొకటి ఫ్లాప్ సినిమాలు వెంట పడుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలియజేస్తోంది.
ఇలాంటి సమయంలోనే ఇంటి మీద నుంచి ఎక్కి దూకాలనుకున్నాదట. చివరికి కౌన్సిలింగ్ తీసుకోవడంతో ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డారని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఇమే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో కొంతమంది నేటిజన్స్ ఇలాంటి చిన్న వాటికే అంత పెద్దటి నిర్ణయాలు తీసుకోవాలా అంటూ ఈమె పైన నెటిజెన్స్ చాలా ఘాటుగా స్పందిస్తున్నారు.