తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సాధించిన విజయంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వెలుపడ్డాయి. అలా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ వైపు తన మకాన్ని మార్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.
అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ రకుల్ తెలుగులో మాత్రం ఎలాంటి సినిమాలను అంగీకరించలేదు. చివరిగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపల్లి సినిమాలో మాత్రమే నటించింది. ఈ చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు దూరమయింది. ఇకపోతే వరుసగా బాలీవుడ్లో సినిమాలలో క్రేజ్ సంపాదిస్తున్న సరైన సక్సెస్ మాత్రం రాలేదు రకుల్ కు. తాజాగా తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియా ద్వారా కొన్ని కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ కామెంట్స్ వైరల్ గా మారుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తాను ఎలాంటి తెలుగు సినిమాలలో నటించలేదని పూర్తిగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నానని తెలియజేసినట్లు తెలుస్తోంది. తను ముంబైలో ఉండడం వల్ల తెలుగు ప్రేక్షకులను చాలా మిస్ అవుతున్నానని తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో అద్భుతమైన చిత్రాలలో నటించాలని ఉంది అయితే సరైన సినిమాలు రాకపోవడంతో తెలుగు సినిమాలకు అవడం లేదని తెలియజేస్తోంది. ప్రస్తుతం తమిళంలో కమలహాసన్ తో ఇండియన్ -2 సినిమాలో షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రకుల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.