యంగ్ డైరెక్టర్ అనిరుద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . పిట్టగోడ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనా మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా అనంతరం జాతి రత్నాలు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో ఒక్కసారిగా ఈయన పేరు మారుమ్రోగి పోయింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమాతోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అతి తక్కువ మంది డైరెక్టర్లలో అనిరుద్ కూడా ఒకరు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా లేదా ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుదీప్ చెప్పే సమాధానాలు అందరినీ తనకు అభిమానులుగా మార్చేస్తూ ఉంటాయి.
ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఎప్పుడైనా ఆయన మాట్లాడితే మరింత ఫన్నీగా ఉంటుందని చెప్పవచ్చు . ఇకపోతే ఎప్పుడు ఎంతో సరదాగా ఫన్నీగా ఉండే అనిరుధ్.. ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అంటే ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతమంది అభిమానులు సొంతం చేసుకున్న ఈయనను.. మనం నిశితంగా పరీక్షించినట్లయితే ఎప్పుడూ కూడా చెప్పులు లేకుండా మనకు కనపడతాడు. సాధారణంగా మనం చెప్పులు లేకుండా కనీసం వాష్ రూమ్ కి కూడా వెళ్ళము.. అలాంటిది అనుదీప్ చెప్పులు లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి కూడా ఒక కారణం ఉంది.
అనుదీప్ చెప్పులు లేకుండా ఎందుకు తిరుగుతున్నారు అనే విషయం గురించి ఇటీవల ఒక ప్రశ్న వేయడంతో ఆ ప్రశ్నను ఆయన దాటవేసినప్పటికీ ఎందుకు చెప్పులు వేసుకోకుండా ఉన్నాడు అని ప్రతి ఒక్కరు అనుమానం వ్యక్తం చేశారు . అయితే అనుదీప్ ఇలా చెప్పులు వేసుకోకుండా ఉండడానికి గల కారణాలను ఆయన సన్నిహితులు వెల్లడించారు.అనుదీప్ ఇటీవల క్లింట్ ఒబెర్ రాసిన ఎర్తింగ్ అనే పుస్తకాన్ని చదివి అందులో అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నారట.
సింథటిక్ వచ్చిన తర్వాత భూమికి మనకి మధ్య ఉన్నటువంటి బాండింగ్ మిస్ అవుతుందని చదివారు. ఇది తెలిసినప్పటి నుంచి ఈయన చెప్పులు వేసుకోవడం మానేశారని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా నువ్వు సూపర్ బాస్ అంటూ తెగ ప్రశంసిస్తున్నారు.