సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వారసత్వం పరంగా నటీనటులు ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా తన టాలెంట్ నిరూపించుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నటీనటులు. ఇటీవల జీవిత రాజశేఖర్ కుమార్తెలు కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నాకు బాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే మంచు కుటుంబం నుంచి మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
నందమూరి కుటుంబంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన బాలకృష్ణ కూతుర్లు సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వలేదు. బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడం పై గల కారణం ఏంటా అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బాలయ్య కుమార్తెలకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఎలాంటి అభ్యంతరం లేదని అయితే తమ కూతుర్లకు స్క్రీన్ పై గ్లామర్ షో చేయడం ఇష్టం లేకపోవడం వల్లే ఇండస్ట్రీలోకి రాలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్న బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణికి సినిమాలు అంటే అసలు ఇష్టం లేదట.
మొత్తం ఎక్కువగా తన ఫోకస్ వ్యాపారాలపైనే ఉండడంతో తాను బిజినెస్ ఉమెన్ గా స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సినిమాలపై మక్కువ ఉన్నప్పటికీ తెరపై కన్నా తెరవ వెనుక నుండి సినిమాలు కోసం పనిచేయడం ఇష్టమట. అందుచేతనే ఆమె హీరోయిన్గా అడుగు పెట్టలేదట. ఇలా బాలయ్య కుటుంబంలో బాలయ్య కూతుర్లు హీరోయిన్గా రాకపోవడానికి ఇవే అన్నట్లుగా సమాచారం.