నట సింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీర సింహారెడ్డి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ బ్యాడ్ సెంటిమెంట్ వైరల్ అవుతుంది. అదేంటంటే గతంలో సంవత్సరాలు వేరైనా ఇదే తేదీకి బాలయ్య నుంచి కొన్ని సినిమాలు వచ్చాయి. 1990 జనవరి 12న `ప్రాణానికి ప్రాణం` సినిమా విడుదలైంది. ఇందులో రజినీ హీరోయిన్గా నటించిన. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత 2011 జనవరి 12న బాలయ్య నటించిన `పరమవీరచక్ర` విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
2017 జనవరి 12న బాలయ్య 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` విడుదలై మంచి విజయం సాధించింది. ఇక 2018 జనవరి 12న `జైసింహ` విడుదల అయింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. `గౌతమిపుత్ర శాతకర్ణి` మినహా జనవరి 12న విడుదలైన బాలయ్య సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. ఈ బ్యాడ్ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయిందంటే `వీర సింహారెడ్డి` సైతం అట్టర్ ఫ్లాపే అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను దాటుకుని హిట్ కొడతారా లేదా అన్నది చూడాలి.