సుమలత కొడుక్కి పెళ్లయిపోయింది… సంబరాల్లో అలనాటి హీరోయిన్!

అలనాటి అందాల తార సీనియర్ యాక్ట్రెస్ సుమలత గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు సహా 200కు పైచిలుకు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి, సినిమా ప్రేక్షకులకు చేరువైంది. మద్రాసులో పుట్టి, బొంబాయి, ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువే. గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేటనే సినీ రంగములో ప్రవేశించింది. ఈమె ప్రత్యేకత మీకు తెలుసా? 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.

తెలుగులో ఆమె తొలిచిత్రం ‘రాజాధిరాజు’. విజయచందర్ హీరోగా, బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఆమె ఓవర్ నైట్ సినిమా హీరోయిన్ గా అవతరించింది. ఈ క్రమంలో సహ కన్నడ నటుడు అంబరీష్ ని ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి “ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి” మొదలైన కన్నడ సినిమాలలో నటించి మెప్పించింది. ఈమె కొడుకే అభిషేక్. తాజాగా అభిషేక్ అంబరీష్, ఫ్యాషన్ లెజెండ్ ప్రసాద్ బిడ్డప్ప కూతురు అవివా బిడ్డప్పల నిశ్చితార్థం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది.

వీరి నిశ్చితార్థానికి అయోగ్య, మదగజ చిత్రాల దర్శకుడు మహేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ వేడుకను తిలకించడానికి కన్నడ సినీ సంగీత దర్శకుడు గురుకిరణ్ దంపతులు కూడా వచ్చారు. అభిషేక్ స్నేహితుడు, జిమ్ మేట్ ప్రజ్వల్, రాగిణి జంట కూడా ఇక్కడకు వచ్చి దంపతులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో అభితో కలిసి ఫోటో దిగి అభి, అవివాకు మనసారా శుభాకాంక్షలు తెలిపారు. కాగా అభి మరియు అవివా నిశ్చితార్థం సరిగ్గా 11.12.2022నాడు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగింది. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.