నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. గ్లామర్ షోతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా కూడా ఈ అమ్మడు చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత అనేంతలా అందాలు ఆరపోసింది.
ప్యాంట్ లేకుండా మోకాళ్ళ పైకి ఉండే లైట్ గ్రీన్ కలర్ కోటు ధరించి.. థండర్ థైస్ తో దడదడలాడించింది. కవ్వించే చూపులతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. రష్మిక తాజా ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు కోటు వేసుకుని ఫ్యాంట్ మరచిపోయిన రష్మిక అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడిగా `పుష్ప 2` సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`, `యానిమల్` చిత్రాలు చేస్తోంది. తమిళంలో విజయ్ దళపతికి జోడిగా ఈమె చేసిన `వారసుడు` వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.