టిల్లుగాడి ల‌వ‌ర్ గా కేతిక‌.. ఈసారి పారిపోయే ఛాన్సే లేదట‌?!

కేతిక శర్మ ఈ హాట్‌ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన `రొమాంటిక్` మూవీతో కేతిక శర్మ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే విచ్చలవిడిగా అందాలు ఆరబోసి యూత్ ని అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత నాగశౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో `రంగ రంగ వైభవంగా` చిత్రాల్లో మెరిసింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. వరుస ప్లాపుల నేపథ్యంలో కేతిక శర్మకు ఆఫర్లు కరువ‌య్యాయి.

ఇలాంటి తరుణంలో ఈ బ్యూటీ ఓ క్రేజీ ఆఫర్ ను అందుకుందంటూ ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి ఇందులో జంట‌గా న‌టించారు. విమల్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌గా.. ఇటీవ‌ల `టిల్లు స్క్వేర్‌` టైటిల్ తో సీక్వెల్ ను అనౌన్స్ చేశారు.

అయితే సీక్వెల్ లో నేహా శెట్టి బ‌దులుగా మ‌రో హీరోయిన్ గా తీసుకోవాల‌ని భావించారు. కానీ, ఈ హీరోయిన్‌ను ఎంపిక చేసినా.. కొద్ది రోజుల‌కే ఈ సినిమాను వ‌దిలి పారిపోతున్నారు. ఈ లిస్ట్ లో శ్రీ‌లీల‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మడోన్నా సెబాస్టియన్ వంటి వారి పేర్లు ఉన్నాయి. దీంతో కొత్త హీరోయిన్‌ కోసం టిల్లుగాడు పడుతున్న కష్టాలు మాములుగా లేవు. ఇక చివ‌ర‌కు టిల్లుగాడి ల‌వ‌ర్ గా కేతికను ఫైన‌ల్ చేశార‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. ఇక ఎలాగో కేతిక ఆఫ‌ర్ల లేక వ‌ర్రీ అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే కేతిక టిల్లుగాడిని వ‌దిలి పారిపోయే ఛాన్సే లేద‌ని అంద‌రూ భావిస్తున్నారు.