అత్యాశ కు పోతే ఇంతే మరి..ఉన్న బన్నీ పరువు కాస్త పాయే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు . ఇప్పటికే అలా ఊహించని సంఘటనలతో స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు.. బొక్క బోర్లా పడి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి . కాగా రీసెంట్గా అలా ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ వేసిన రాంగ్ స్టెప్ .. ఇప్పుడు సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ నటించిన సినిమా రిలీజ్ అయ్యి తెలుగు చలనచిత్ర రికార్డును తిరగరాసింది.

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఫస్ట్ టైం బన్నీ ఫుల్ లెంత్ లో కనిపించడం సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి డైలాగ్ ఇప్పటికి మనం డైలీ బేసిస్ లో వాడుతూనే ఉన్నామంటే ..సినిమా ఎలాంటి హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇదే క్రమంలో రష్యాలో సైతం సినిమా హ్యూజ్ సక్సెస్ అందుకుంటుంది అని భావించిన చిత్ర బృందం డిసెంబర్ 8న గ్రాండ్ గా రష్యాలో పుష్ప సినిమాను రష్యన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు .

అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . కేవలం మూడు రోజుల్లోనే థియేటర్ నుంచి తీసేసారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాకు ఏకంగా ఐదు కోట్లకు పైగానే నష్టం వచ్చిందంటూ ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది . దీంతో ఇండియాలో సూపర్ డూపర్ హిట్ పుష్ప.. రష్యాలో డిజాస్టర్ గా మారింది అంటూ కొందరు నెటిజెన్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఇండియాలో సంపాదించుకున్న పరువుని రష్యాల్లో పోగొట్టుకున్నాడు అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు.