తెలుగు చిత్ర పరిశ్రమ ఇద్దరు సీనియర్ హీరోలను కావాలనే అవమానిస్తుందని సీనియర్ ప్రొడ్యూసర్ నిర్మాతల మండలి అధ్యక్షుడైన సి కళ్యాణ్ ఆరోపించాడు. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులను ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన థియేటర్లను రానివ్వకుండా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై నిర్మాతలు మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ చాలా ఘాటుగా స్పందించాడు. రాబోయే సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు థియేటర్లు దక్కకుండా చేయడం కరెక్ట్ కాదని సి కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు మూల స్తంభాలుగా ఉన్న ఇద్దరు సీనియర్ లెజెండ్రీ నటులను తెలుగు చిత్ర పరిశ్రమ అవమానిస్తుందని ఆయన మండిపడ్డాడు.
ఇక ఇప్పుడు ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందించాలని ఆయన కోరాడు. సంక్రాంతి పండుగ సీజన్లో మన తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రూల్ కి కట్టుబడి ఉండాలని ఆయన చెప్పుకొచ్చాడు. మన తెలుగు రాష్ట్రాలలో వచ్చే ముఖ్యమైన పండుగలు మన తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. డబ్బింగ్ సినిమాలకు ఇవ్వకూడదనే నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదు ఇదివరకే తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎగ్జిబిటర్లకు ఈ విషయం విజ్ఞప్తి చేసిందని.. ఇప్పుడు ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిందని ఆయన అన్నాడు. మన పక్క ఇండస్ట్రీలు అయిన తమిళ, కన్నడ పరిశ్రమలు ముందుగా వాళ్ళ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు. మనం మన సినిమాలుకు ప్రాధాన్యత ఇవ్వాలని సి కళ్యాణ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈయన అన్న వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.