టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ లలో ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి పలు చిత్రాలలో కీలకమైన పాత్రల నటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన తర్వాత సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది అభిమానులు తమ అభిమాన హీరోయిన్ కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు నాగార్జునతో కలిసి నటించిన చంద్రలేఖ సినిమాలోని ఒక హీరోయిన్.
కృష్ణవంశీ దర్శకత్వంలో 1998లో విడుదలైన ఈ చిత్రంలో హీరోయిన్స్ గా రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ నటించారు. ఇషా కొప్పికర్ అయితే ఇప్పుడు ఈమె ఎలా ఉందనీ ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈమె తమిళ్ ,తెలుగు, కన్నడ, మరాఠీ వంటి భాషలలో కూడా నటించింది. చంద్రలేఖ సినిమా తర్వాత ఈమె తెలుగులో నటించిన మరొక చిత్రం ప్రేమతో రా, ఆ తర్వాత కేశవ అనే సినిమాలో కనిపించింది. ఇక అటు తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు ఈ అమ్మడు. అయితే ఆమధ్య బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తోంది అనే వార్తలు అయితే వినిపించాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లుగా సమాచారం.
2009వ సంవత్సరంలో టిమ్మి నారంగ్ ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక సంతానం కూడా కలరు. ఇషా కొప్పికర్ ఇప్పటికీ ఈమె సినిమాలలో నటిస్తూనే ఉన్నది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది.ఇషా కొప్పికర్ సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఏమైనా చూసిన అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram