నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ రెండో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో అదరగొడుతుంది. ఈ సీజన్ లో కూడా పలువురు సెలబ్రిటీలతో బాలయ్య చేసిన రచ్చ మామూలుగా లేదుగా.. ఈ సీజన్ లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. ఇక ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్నా అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోయే ఎపిసోడ్ లుకు కూడా అదిరిపోయే గెస్ట్‌లు రానున్నారు.
ఇక ఇప్పుడు రాబోయే ఎపిసోడ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అతని స్నేహితుడైన మరో హీరో గోపీచంద్ కూడా బాలయ్యా షోలో సందడిచేయబోతున్నారు. ఇక వీరితో పాటు టాలీవుడ్ లోనే సీనియర్ హీరోయిన్స్ గా ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేసిన జయ ద్వయం-జయప్రద, జయసుధ కూడా అన్ స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్నారు.
ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత జయప్రద, జయసుధ ఎపిసోడ్ షూటింగ్ మొదలుకానుందిని తెలుస్తుంది. 70, 80వ దశకంలో ఎన్టీఆర్‌కు హిట్ పేయర్స్ గా నిలిచిన జయప్రద, జయసుధ వీరిద్దరితోను బాలకృష్ణ నటించాడు. అయితే జయసుధ ఒక్కరే బాలయ్యకు జోడీగా అధినాయకుడు సినిమాలో నటించింది. మహారధి సినిమాలో ఆయనకు అత్తగా జయప్రద నటించింది.
ఇక మరో అరుదైన విశేషం ఏమిటంటే.. వీరిద్దరితోనూ ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో బాలయ్య నారుదుని పాత్ర ధరించి వీరిద్దరితోనూ నటించాడు. బాలయ్య తన కెరియర్ మొదటిలోనే జయ ద్వయంతో జోడి కాటాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది సెట్ కాలేదు. వీటికి సంబంధించిన ముచ్చట్లన్నీ ఆ ఎపిసోడ్‌లో వస్తాయని తెలుస్తుంది. ఏదేమైనా ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం మరో రికార్డును క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. తర్వాత వచ్చే సీనియర్ హీరోయిన్ ఎపిసోడ్ కూడా అందరికీ కన్నుల విందు చేస్తున్న అని చెప్పవచ్చు.