మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎటువంటి సినీ సపోర్ట్ లేకుండా వచ్చి తన స్వయంకృషితో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనను కెరియర్ మొదటిలో తొక్కేయాలని చాలామంది ప్రయత్నించారు.. కానీ చిరంజీవి అవన్నీ పట్టించుకోకుండా ఒక్కో సినిమాతో తనెంటో ప్రూవ్ చేసుకుంటూ చిత్ర పరిశ్రమలోని గాడ్ ఫాదర్ గా ఉన్నారు. ఈయన సినీ ఇండస్ట్రీలో వచ్చిన తొలినాళ్లలో చాలామంది చిరంజీవిని సూటి పోటి మాటలతో అవమానించేవారట. అయినా చిరంజీవి అవమానాలు అన్ని దిగమింగుకుని అగ్ర హీరోగా ఎదిగాడు.
ఈ క్రమంలోనే చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈయనను చూసిన అల్లు రామలింగయ్య ఇతను ఎప్పటికైనా పరిశ్రమను ఏలుతారని చెప్పారట.. అంతేకాకుండా తన కూతురు సురేఖ నీ ఇచ్చి వివాహం కూడా జరిపించాడు. అల్లు రామలింగయ్య ,చిరంజీవి తన ఇంటి అల్లుడయ్యాక అతని సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారట. ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమంలో ఎక్కువగా కమ్మ కులానికి చెందిన వాళ్లే ఉండేవారట.
ఇక చిరంజీవి హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో SR. ఎన్టీఆర్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. కానీ అదే టైంలో ఎన్టీఆర్ తన కొడుకు బాలకృష్ణని టాలీవుడ్ లోకి పరిచయం చేశారు. అప్పుడు బాలకృష్ణను ఆగ్ర హీరోగా చేయడానికి చిరంజీవిని ఎక్కడ తొక్కేస్తారని భయంతో అల్లు రామలింగయ్య చిరంజీవిని ప్రత్యేకంగా తన దగ్గరకు రమ్మని నువ్వు ప్రతిరోజు ఎన్టీఆర్ ఇంటి గేటు నుండి ఒక అంబాసిడర్ కారు వస్తుంది. ఆ కారులో ఉండే సీనియర్ ఎన్టీఆర్‌కు నువ్వు ప్రతిరోజు నమస్కారం పెట్టాలని చెప్పాడట.
చిరంజీవి ఆయన ఎందుకు చెప్పాడో కూడా తిరిగి అడగకుండా ప్రతిరోజు ఎన్టీఆర్ కి నమస్కారం చేసేవారట. అప్పుడు అల్లు రామలింగయ్య ఇలా చెప్పడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్‌కి, చిరంజీవ కూడ మన వాడే కథ అనే ఒక భావన ఆయనలో కలుగుతుందనే భావనతో అల్లు రామలింగయ్య చిరుకు అలా చెప్పారట. ఈ విధంగా అల్లు రామలింగయ్య తన అల్లుడిని కాపాడుకోవడానికి ఈ విధంగా ప్లాన్ వేశారట.