గత కొద్ది రోజులుగా నటీనటుల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నటీనటుల తమ బాల్యం తాలూకు జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ వ్యక్తిగత ఫ్యామిలీ విషయాలను… సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే మరికొందరు నటీమణులు తమ అభిమానులను కన్ఫ్యూజ్ చేయడానికి వారి వింత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ బ్లాక్ డ్రెస్ ధరించి వింత స్టిల్ లో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో కింద నేనెవరో గుర్తు పట్టండి అంటూ కామెంట్ కూడా ఇచ్చింది.
పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ వైవిధ్యమైన సినిమాలను చేసుకుంటూ.. తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ఈ సంవత్సరం కూడా వరుస సూపర్ హిట్ సినిమాలలో ఈ చిన్నది కూడా నటించింది. ఇక ఈ హీరోయిన్ ఎవరో కాదు మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి.. 2014లో మోడల్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి.. జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలో తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి.
తర్వాత యాక్షన్ సినిమా ద్వారా కోలీవుడ్ లో కూడా హీరోయిన్‌గా ఎంట్రీ వచ్చింది. ఈ అందాల భామ తర్వాత సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే సినిమాతో టాలీవుడ్ లో కూడా పరిచయం అయింది. ఇక దీంతోపాటు రీసెంట్‌గా విడుదలైన అమ్ము సినిమాతో తన నటనతో అందర్నీ ఆకర్షించింది ఐశ్వర్య. అలాగే కోలీవుడ్ అగ్ర దర్శకుడు మణిరత్నం డ్రీం ప్రాజెక్టుగా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య నటించింది. అలాగే సాయి పల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన గార్గి సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో ఐశ్వర్య నటించింది.
తాజాగా రవితేజ ప్రొడ్యూస్ చేసిన మట్టి కుస్తీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ విశాల్ చల్లా అయ్యవు తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram