భారీ లాభాల‌తో ర‌ఫ్ఫాడిస్తున్న‌ `హిట్ 2`.. రెండో వారం కూడా ఆపేవాడే లేడు!

ఈ ఏడాది `మేజ‌ర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ రీసెంట్ `హిట్ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు.

ఇందులో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తే.. కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను అందుకుంది. దీంతో విడుద‌లైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిన ఈ చిత్రం.. తొలి వారం అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

రెండో వారం నుండి హిట్ 2 యొక్క కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంద‌ని భావించారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. తాజాగా బాక్సాఫీస్ వద్దకు పదికి పైగా సినిమాలు వచ్చాయి. కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ ని అవ్వలేదు. దాంతో రెండో వారం కూడా ఆపేవాడే లేక‌పోవ‌డంతో హిట్ 2 భారీ వసూళ్లు నమోదు చేయడం కన్ఫర్మ్ అయింది. ఇక ఏరియాల వారీగా హిట్ 2 ఎనిమిది రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 6.33 కోట్లు
సీడెడ్: 1.39 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.69 కోట్లు
తూర్పు: 84 ల‌క్ష‌లు
పశ్చిమ: 56 ల‌క్ష‌లు
గుంటూరు: 85ల‌క్ష‌లు
కృష్ణ: 78 ల‌క్ష‌లు
నెల్లూరు: 49 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 12.93 కోట్లు(21.55 కోట్లు~ గ్రాస్‌)
———————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 2.00 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 3.95 కోట్లు
————————————
వైర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ = 18.88 కోట్లు(34.30 కోట్లు~ గ్రాస్‌)
————————————

కాగా, ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. అయితే నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను బ్రేక్ చేసిన ఈ చిత్రం.. 8వ రోజు వ‌సూళ్ల‌తో రూ. 3.88 కోట్ల రేంజ్ లాభాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ర‌ఫ్ఫాడిస్తోంది.