టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా చిరంజీవి – బాలకృష్ణ మధ్య సినిమాల పోటీ అందరికన్నా ప్రత్యేకం అందులో సంక్రాంతి పోటీ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతూనే ఉంది. సై అంటే సై అనే విధంగా ఇద్దరు ఎన్నోసార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు. ఇద్దరి హేమాహేమీలలో కొన్నిసార్లు బాలయ్య గెలిస్తే మరికొన్నిసార్లు చిరంజీవి ఆధిపత్యం ఉండేది. అభిమానుల పరంగా ఇద్దరికీ సమాన స్థాయిలో ఉన్న.. ఓవరాల్ మార్కెట్ పరంగా చూస్తే మెగాస్టార్ కి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది.
అయితే చిరంజీవి, బాలకృష్ణ మార్కెట్ ను ఎప్పుడూ డామినేట్ చేస్తూనే వచ్చాడు. బాలయ్య సినిమాలు ప్రత్యేకం మాస్ అభిమానులను ఎక్కువగా అలరిస్తాయి. అయితే చిరంజీవి మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాలను అలరించే సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను పెంచుకున్నాడు. అందుకే టాలీవుడ్ కి మకుటం లేని మహారాజుగా మెగాస్టార్ ఎదిగాడు. తన సినిమాలతో సింగిల్ హ్యాండ్ తో కోట్లకు కోట్ల కలెక్షన్ అని రాబట్టుకుంటున్నాడు. అయితే పాలిటిక్స్ నుంచి మళ్లీ సినిమాలు కి రీఎంట్రీ ఇచ్చాక చిరంజీవి సినిమాల స్టైల్ మారింది.
తన సింగిల్ హ్యాండ్ తో కోట్లకి కోట్లు కలెక్షన్స్ రాబట్టే చిరంజీవి ఈ మధ్య తన సినిమాలలో ఇతర హీరోలకి అవకాశం ఇస్తున్నాడు. ఆచార్య సినిమాలో తన కొడుకు రామ్ చరణ్ తో చిరంజీవి నటించగా, రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు సంక్రాంతికి రాబోయే వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవితేజ తో చిరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.
ఆయన ఇప్పుడు వరుసగా ఇలాంటి సినిమాలు చేస్తుంటే చిరు కావాలనే మల్టీస్టారర్ కథలని ఎంచుకుంటున్నాడ అనే అనుమానాలు వస్తున్నాయి. సోలోగా కలెక్షన్లు సాధించడం కష్టం అనుకుంటున్నాడా అని మెగా యాంటీ ఫ్యాన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ఇక మరోవైపు బాలయ్య సొలోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ సందర్భంలోనే సంక్రాంతికి రానున్న వీర సింహారెడ్డి- వాల్తేరు వీరయ్యల సమరంపై కొత్త వాదన వినిపిస్తుంది.
రాబోయే సంక్రాంతి సమరంలో బాలయ్య గెలిచినా చిరంజీవి గెలిచిన.. అది చిరంజీవికే ఇబ్బందిగా మారే పరిస్థితిలు ఉన్నాయి అంటున్నారు. బాలకృష్ణ విజయం సాధిస్తే.. చిరంజీవి రవితేజని తీసుకొని కూడా బాలయ్య పై విజయం సాధించలేకపోయాడనే అపవాది మెగాస్టార్ కి వస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి విజయం సాధిస్తే అది రవితేజ సాయంతో పై చేయి సాధించారనే విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంతకాలం రామ్ చరణ్- సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో నటించిన రాని ఈ చర్చ ఇప్పుడు రవితేజతో చిరంజీవి నటించినప్పుడు ఈ వాదన బయటకు వచ్చిందంటే కారణం, బాలయ్య, చిరంజీవి సంక్రాంతి సమరంలో పోటీకి దిగడమే.. ఇప్పుడు అందరికీ ఒకే ఒక డౌట్ బాలకృష్ణకు లేని భయం చిరంజీవికి ఎందుకు వస్తుంది..? అసలు చిరంజీవికి ఏం తక్కువయింది అంటూ మెగా కాంపౌండ్ పై వేలు చూపిస్తున్నారు.