నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో బాలయ్యకు సూపర్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆ షో తో బాలకృష్ణ తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆషో కు రెండో సీజన్ కూడా ఆహాలో ప్రారంభమైంది. ఇప్పుడు జరిగే ఈ సీజన్ మొదటి సీజన్‌కు మించి అదిరిపోయే రీతిలో దూసుకుపోతుంది.
ఈ సీజన్ లో సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులు కూడా బాలయ్య షోలో సందడి చేస్తున్నారు. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు బాలయ్య అల్లుడు లోకేష్ అతిథులుగా రాగా.. ఈ ఎపిసోడ్ కు ఏ టాక్ షోకు రానీ భారీ వ్యూస్ రాబట్టుకుంది. తర్వాత నాలుగో ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- మాజీ స్పీకర్ ప్రస్తుత తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేశారు.
ఇప్పుడు రాబోయే ఎపిసోడ్‌లో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గోపీచంద్ కూడా బాలయ్యతో సందడి చేయబోతున్నారు. అయితే గతంలో ఈ షో కి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కూడా బాలయ్య షోలో సందడి చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. బాలకృష్ణ స్వయంగా రోజాను అన్ స్టాపబుల్ షోకి ఆహ్వానించగా.. ఆమె నో చెప్పిందట. అయితే ఇప్పుడు ఆమె షో కి ఎందుకు వెళ్లలేదు అన్న ప్రశ్నకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.
రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కీలకంగా ఉంది. తాను రాజకీయాలలో బిజీగా ఉండటంతో సినిమాలకు కూడా గుడ్ బాయ్ చెప్పింది.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ షోకి రోజా ఎందుకు నో చెప్పింది అన్న ప్రశ్నకు ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆమె ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు బాలకృష్ణకి ఎలాంటి గొడవలు లేవు మా ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది’. ‘ఆయన కుటుంబానికి నా కుటుంబ సభ్యులుకి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ నేను పార్టీ మారాక వారి ఫ్యామిలీతో మాట్లాడటానికి నాకే కొంచెం మొహమాటం అడ్డు వస్తుంది.. నా ప్రతి పుట్టినరోజుకి ఆయన నాకు ఫోన్ చేసి విషెస్ చెప్తారు’.
‘బాలకృష్ణ గారు అన్ స్టాపబుల్ మొదటి సీజన్ లోనే నన్ను గెస్ట్ గా ఆహ్వానించారు. కానీ నేనే వెళ్లలేదు. ఎందుకంటే రాజకీయం వేరు… సినిమా వేరు కాబట్టి అలాంటి కార్యక్రమాలకు వెళ్లడం లేదు’. ‘ఒకవేళ నేను బాలకృష్ణ షో కి వెళితే ఎవరో ఒకరు నేను మాట్లాడిన మాటలను వివాదాస్పదం చేస్తూ.. అలాగే నేనంటే గిట్టని వారు జగన్ గారి దగ్గర నా గురించి నెగిటివ్‌గా చెబుతారని భయపడి నేను ఈ షో కి వెళ్ళలేదు’. ప్రస్తుతం రోజా అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.