రెండో పెళ్లికి సిద్ధమే అంటున్న కరాటే కళ్యాణి..!!

ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలలో వ్యాంప్ పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది. తరచూ ఏదో ఒక వివాదంలో తలదురుస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల నిరంతరం వార్తలు నిలుస్తూ ఉంటుంది కరాటే కళ్యాణి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది ముఖ్యంగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేసింది కరాటే కళ్యాణి. వాటి గురించి తెలుసుకుందాం.

Tollywood actor Karate Kalyani lands in another row
కరాటే కళ్యాణి మాట్లాడుతూ ఇండస్ట్రీలో అందరూ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తాను ఎదుర్కోలేదని ఎందుకంటే తనకు కరాటే వచ్చు అన్న కారణంతోనే ఎవరు తనని పెద్దగా హింసించేవారు కాదని తెలియజేస్తోంది. కానీ తన భర్త మాత్రం ప్రతిరోజు తాగొచ్చు తనని చాలా చిత్రహింసలు పెట్టే వారిని తెలియజేస్తోంది. అలా చిత్రహింసలు చేసినా కూడా తన పైన ఎప్పుడు చేయి చేసుకోలేదని అందు కారణం భర్త అనే గౌరవం అని తెలియజేస్తుంది ఈమె. ఒకరోజు ఫుల్లుగా తాగి వచ్చి రోడ్డుపైన తన దుస్తులు అన్ని లాగేసారని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంది కరాటే కళ్యాణి. ఇక తన భర్త టార్చర్ భరించలేక తను నుండి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

ఇలా భర్తకు దూరంగా ఉన్నటువంటి తనకు ఒక తోడు కావాలని తిరిగి వివాహం చేసుకోవాలని తన తల్లి తనని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలిపింది. దీంతో తను కూడా రెండవ పెళ్లి చేసుకోవాలని దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఈ ఇంటర్వ్యూలో తెలియజేసింది. అంతేకాకుండా తనను తానుగా ప్రేమించే వ్యక్తి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని తెలియజేస్తోంది. ప్రస్తుతం కరాటే కళ్యాణి రెండో పెళ్లిపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.