ఆ ఇద్ద‌రికీ పెళ్లి అయిపోయింది కాబ‌ట్టి నా నెక్స్ట్ మూవీలో ఆమెనే హీరోయిన్‌: బాల‌య్య‌

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేదికగా `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` షోకు ఘోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ వన్ టాక్ షోగా రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీజన్ 2 ను ప్రారంభించారు.

పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సందడి ఈ షోలో చేశారు .తాజాగా ఈ షోకు సీనియర్ స్టార్ హీరోయిన్లు జయప్రద, జయసుధ పాటు యంగ్ బ్యూటీ రాశి ఖ‌న్నా స్పెషల్ గెస్ట్ లుగా హాజ‌రు అయ్యారు. ఈ ముగ్గురు భామ‌ల మధ్య బాలయ్య నెక్స్ట్ లెవెల్ లో సందడి చేశారు. అలాగే వారి దగ్గర నుంచి బాల‌య్య‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టారు. ఈ క్రమంలోనే జయసుధ జయసుధలు క‌లిసి బాలయ్యను కొన్ని ప్ర‌శ్న‌లు అడిగారు.

వాటికి స‌ర‌దాగా బాల‌య్య స‌మాధానాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే మీ నెక్స్ట్ సినిమాలో కృతి సనన్, అలియా భట్, దీపికా పదుకొనే లలో ఎవర్ని హీరోయిన్ గా పెట్టుకుంటారు..? అని ప్ర‌శ్నించారు. అందుకు బాల‌య్య‌.. `అలియాభట్ కి పెళ్లి అయిపోయి పాప కూడా పుట్టింది, దీపికాకి పెళ్లి అయిపొయింది. కృతి సనన్ ఖాళీగా ఉంది కాబట్టి ఆమెనే నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాను` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, సంక్రాంతికి `వీర సింహారెడ్డి`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని అనిల్ రావిపూడితో చేయ‌బోతున్నారు.