రవితేజ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం అదేనట..!!

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ మధ్య రవితేజ ఏ సినిమాకు హాజరుకాని ఇంటర్వ్యూలకు ఈ చిత్రానికి హాజరయ్యారు. పలు ప్రత్యేక కార్యక్రమాలలో సందడి చేసిన ధమాకా చిత్ర బృందానికి ఈ సినిమా మంచి విజయం అందుకుంది. రవితేజ పాల్గొన్న ఇంటర్వ్యూలలో తన రాబోయే సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో తన నటిస్తున్న తదుపరి చిత్రాలలో ఒకటైన టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి పుల ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Ravi Teja's Tiger Nageswara Rao first poster out. See hereరవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా సినిమా అని తెలియజేశారు.తన ప్రతి సినిమాను కూడా పాన్ ఇండియా సినిమా అనుకోనని తనకంటూ పాన్ ఇండియా సినిమా అంటే సపరేటుగా ఒక అర్థం ఉందని అందుకే ధమాకాను కూడా పాన్ ఇండియా సినిమా అనడానికి వీలులేదని తెలిపారు. కానీ నేను చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా అన్నట్లుగా తెలియజేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నామని భారీ విజువల్స్ గ్రాండి యర్ ఉండకున్నా కూడా పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవచ్చు అని తెలిపారు.

కథ మరియు కాన్సెప్ట్ వల్ల టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా సినిమాగా తాను భావిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది రవితేజ. రవితేజ కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే ముందు ముందు రవితేజ నుండి వరుసగా పాన్ ఇండియా సినిమాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజ కెరీర్ ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి మరి.