2022లో రష్మిక నుంచి సాయి పల్లవి వరకు బిగ్గెస్ట్ మూవీ కాంట్రవర్సీస్..

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎన్నో వివాదస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

కిచ్చా సుదీప్

బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీని జాతీయ భాష కాదు అనడంతో ఈ విషయం వివాదంగా మారింది. ఈ విషయంపై నటుడు అజయ్ దేవ్‌గణ్, సుదీప్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

సాయి పల్లవి

ఇండస్ట్రీలో సహజ నటిగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి అనుకోకుండా మత పరమైన కాంట్రవర్సీలో చిక్కుకుంది. ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాలో పండిట్స్ పై జరిగిన హింసను చూపించారు. దాంట్లో భాగంగా సాయి పల్లవి ‘హిందువులే కాదు మైనారిటీలుగా ఉన్న ముస్లిమ్స్ కూడా గోరక్షణ పేరుతో హింసకు గురవుతారని’ అని అన్న మాటలను బీజేపీ వర్గాలు తప్పు పట్టాయి.

కాంతార

కన్నడ చిత్రం అయిన ‘కాంతార’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా దేశమంతటా మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమాకి కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దళితుల జీవితాలను ఈ చిత్రం అవమానించేలాగా ఉంది, అలానే ఈ సినిమాలో మహిళలను ద్వేషించే సన్నివేషాలు ఉన్నాయని , అంతేకాకుండా వరాహ రూపం అనే పాటను కాపీ చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.

నయనతార

ఇటీవలే పెళ్లి చేసుకొని వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రముఖ నటి నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ లు సరిగసి ద్వార తల్లితండ్రులు అయ్యారని ప్రకటించారు. ఈ విషయం లో సరోగసి నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలను ఈ జంట ఎదురుకుంటున్నారు.

రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక కాంతార సినిమా చూడలేదనే విషయం వివాదస్పదంగా మారింది. సొంత పరిశ్రమ నిర్మించిన ఒక అద్భుతమైన సినిమాని రష్మిక చూడకపోవడం అనేది అవమానాకరం అని ఆమెని కన్నడ ఇండస్ట్రీ నుంచి తొలిగించే ప్రయత్నం చేసారు. దాంతో రష్మిక వెంటనే ఆ విషయం గురించి వివరణ ఇచ్చింది.

లైగర్

లైగర్ సినిమా నిర్మాత బిజినెస్ వ్యవహారాలలో కొన్ని ఆర్థిక నేరాలు జరిగాయాని ఈడీ అధికారులు లైగర్ సినిమా డైరెక్టర్ పూరి జగనాథ్, నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండను విచారించారు.