బాలయ్యకు విలన్‌గా టాలీవుడ్ ముదురు ఆంటీ… లేడీ విల‌న్‌గా అద‌ర‌గొడుతుందా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో అదిరిపోయే హిట్ తో కం బ్యాక్ ఇచ్చి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ తొలి సీజన్ ను అదిరిపోయే రేంజ్‌లో సూపర్ హిట్ చేసి రెండో సీజన్ కూడా అదే రేంజ్ లో కొనసాగిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు బాలకృష్ణ తన 107వ సినిమా వీర సింహారెడ్డిని క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు.

NBK107 Titled Veera Simha Reddy, Releasing For Sankranthi 2023 -  IndustryHit.Com

 

ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుండగా.. బాలయ్యకు ప్రతి నాయకుడుగా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సాంగ్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. బాలకృష్ణ ఈ సినిమాతో మరో అఖండను మించి అదిరిపోయే హిట్ అందుకుంటాడంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత‌ బాలకృష్ణ తన 108వ సినిమాను కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలని పూర్తి అవ్వగా జనవరి రెండో వారం నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఈ సినిమాలో బాలయ్య తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో ప్రత్యేకంగా కనిపించపోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్యకు కూతూరుగా పెళ్లి సందడి ఫ్రేమ్ శ్రీలీలా నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకురాలిగా టాలీవుడ్ లో ఉన్న ఓ సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్ పాత్ర ఎంతో వైవిధ్యంగా… కాస్త నెగ‌టివ్ ట‌చ్‌తో ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఆ సీనియర్ హీరోయిన్ మ‌రెవరో కాదు సీనియ‌ర్ న‌టీమ‌ణి రాశి ఇప్పటికే దర్శకుడు అనిల్ రాశితో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. రాశి కూడా క‌థ నచ్చడంతో తను ఈ సినిమాలో చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానుంది.

Share post:

Latest