అడివి శేష్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. పంజా, బాహుబలి, క్షణం, రన్ రాజా రన్ లాంటి సినిమాలతో మనోడు తెలుగునాట సూపర్ పాపులర్ అయ్యాడు. దర్శకుడు అడివి సాయికిరణ్ కు శేష్ తమ్ముడి వరస అవుతాడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం వలన శేష్ పెద్దగా పరిచయం అవ్వలేదు. ఆ తరువాత 2011 లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించిన తరువాతనే మనోడు లైం లైట్ లోకి వచ్చాడు.
ఆ తరువాతి కాలంలో శేష్ సినిమా కెరీర్ పరంగా తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తరువాత అతని సినిమా జీవితంలో పెనుమార్పులే సంభవించాయి. బేసిగ్గా టాలెంటె కలిగిన హీరో కావడంతో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా 6 సినిమాలు హ్యాట్రిక్ హిట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నుండి కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి.
అదేమంటే, ఇంత ట్రాక్ రికార్డ్ వున్నా పెద్ద బ్యానర్లలో శేష్ కి భారీ బడ్జెట్ చిత్రాలు రాకపోవడం ఇపుడు అంతటా చెవులు కొరుక్కుంటుంటున్నారు. అలాగే అతని నుండి ఇంతవరకు ఓ మాస్ మసాలా సినిమా వచ్చిన పాపాన లేదు. అయితే అలా ఎందుకు జరిగింది అన్న విషయంలో ఇపుడు డిబేట్స్ జరుగుతున్నాయని సమాచారం. ఇకపోతే టాలీవుడ్లో సైలెంట్ గా తనదైన ముద్ర వేసుకుంటున్నారు యంగ్ హీరో అడివి శేష్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏండ్లు దాటినా నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటిస్తూ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.