బాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమలు బ్రేకప్ లు సర్వసాధారణం.. స్టార్ హీరోయిన్ల నుంచి హీరోల వరకు సగానికి పైగా బాలీవుడ్ లో బ్రేకప్ చెప్పుకున్నవారే. అయితే ఇప్పుడు బాలీవుడ్ అందాల భామ్మ దిశా పాట్నీ మరో స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీళ్ళ ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడు అధికారికంగా వీళ్ళు ప్రకటించలేదు. కానీ ఒక రెస్టారెంట్ నుంచి ఇద్దరూ క్లోజ్ గా బయటికి రావడంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనే క్లూస్ ఇచ్చారు.
అయితే బాలీవుడ్ లో ఉన్న మిగతా ప్రేమ జంటలతో పోలిస్తే దిశా- టైగర్ అందుకు భిన్నంగా వారి బంధాన్ని చాలా కాలం కొనసాగించారు. వారు కలిసి సినిమాల్లో కూడా నటించారు, కలిసి డేటింగ్ కూడా చేశారు.. అయితే ఇప్పుడు ఏమైందో కానీ కొంతకాలంగా వీరిద్దరి మధ్య బ్రేక్ అప్ అయిందంటూ రూమర్లు వస్తున్నాయి. ఐదేళ్ల ప్రేమ తరవాత పెళ్లి పీటలు ఎక్కుతారని ఊహగానాల నుంచి విడిపోయారనే వార్తలు రావడం ఆసక్తిగా మారింది. వారు విడిపోతున్నట్టు అధికారికంగా బయటకు చెప్పకపోయినా, దాదాపు వీరిద్దరు విడిపోయినట్టుగానే వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలకు నిదర్శనంగా దిశా మరో కొత్త బాయ్ ఫ్రెండ్ ను తెరపైకి తెచ్చింది. అతను కొత్త వాడు ఏమీ కాదు.. దిశాకు పాత పరిచయమైనట. ఇద్దరు 2015లో ఓకే ఇంట్లో నివసించే వారట. ఆ వ్యక్తి కూడా తన కెరీర్ మోడలింగ్ ద్వారానే మొదలుపెట్టి బాలీవుడ్ లో టాప్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే దిశా తన కెరియర్ మొదటి నుంచి అతనితో స్నేహ సంబంధాలు ఉన్నాయట.. వారిద్దరు కెరియర్ మొదటిలో ఒకరికి ఒకరు బాసటగా ఉండేవారమని అలెగ్జాండర్ అలెక్స్ చెప్పుకొచ్చాడు.
వారిద్దరి మధ్య ఉన్నది ప్రేమ ,స్నేహమా అనేది బయటకు చెప్పేస్తే ఒక్క మాటతో వదిలిపోతుంది.. కానీ అలెక్స్ అతని గురించి ఆరాలే వద్దంటూ కొత్త ఊహాగానాలకు తెర లేపుతున్నాడు. దీంతో దిశ తన పాత ఫ్రెండ్‌ను కొత్త బాయ్ ఫ్రెండ్ గా మార్చింది అంటూ వస్తున్న రూమర్లకు అతని మాటలతో మరింత బలం చేకూరింది. ప్రస్తుతం ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.