ప్రస్తుతం బాలీవుడ్‌లోని ఇద్దరు ఐటమ్ గర్ల్స్ మధ్య ఒక పెద్ద వార్ నడుస్తోంది. వారు మరవరో కాదు బాలీవుడ్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతెహి. వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఈ క్రమంలోనే జాక్వెలిన్‌పై నోరా పరువు నష్టం కేస్ దాఖలు చేసింది. ఎందుకో తెలుసుకుంటే.. గతంలో మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ని విచారించారు. ఈ కేసులో A1గా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్, నోరాలకు టచ్‌లో ఉన్నాడని సమాచారం.
అంతేకాకుండా ఈ ఇద్దరి ముద్దుగుమ్మలకు సుఖేష్ నుంచి చాలా ఖరీదైన బహుమతులు అందాయని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ కేస్‌లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు చాలా విచారణలు ఎదుర్కొన్నారు. బాలీవుడ్లో వీరికేసు పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ సందర్బంగా జాక్వెలిన్ కోర్ట్‌కి ఒక లేఖ రాసింది. ఇక అప్పటినుంచి జాక్వెలిన్‌కి, నోరాకి మధ్య వివాదం రాజుకుంది. జాక్వెలిన్ తన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ నుంచి నోరా ఫతెహి కాస్ట్లీ గిఫ్ట్స్ ని అందుకుందని రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నోరా జాక్వెలిన్‌పై కోపాన్ని పెంచుకుంది.
సుఖేష్ చంద్రశేఖర్‌కి తనకి ఎటువంటి సంబంధం లేదని, కేవలం అతని భార్యతోనే తనకి పరిచయం ఉందని ఒక క్లారిటీ ఇచ్చింది. అలానే సుఖేష్ నుంచి ఆమె ఎటువంటి గిఫ్ట్స్ అందుకోలేదని చెప్పుకొచ్చింది. జాక్వెలిన్ కావాలనే తనని ఆ కేసులో ఇరికించి తన కెరీర్ నాశనం చేయాలని చూస్తోందని నోరా వాపోయింది. జాక్వెలిన్ ఇచ్చిన తప్పుడు కంప్లైంట్ వల్ల తనకి వచ్చిన అవకాశాలు, యాడ్స్ చేజరిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
అందుకే ఢిల్లీ కోర్ట్‌లో జాక్వెలిన్‌పై రూ.200 కోట్లు పరువు నష్టం కేసు వేసినట్లు వెల్లడించింది. అలానే మనీ లాండరింగ్ కేస్‌లో జాక్వెలిన్ చెప్పగానే ఏ ఆధారాలు లేకుండా ‘నోరా’ అని తన పేరు తప్పుగా రాసిన కొన్ని మీడియా సంస్థల పేర్లని కూడా ఆ దావలో ఈ ముద్దుగుమ్మ రాసింది. కాగా ఈ వ్యవహారం బీటౌన్‌లో సంచలనంగా మారింది.