తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో బాహుబలి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి బాహుబలి సినిమాలలో నటించి తన కెరీయర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చేశారు రాజమౌళి. రాజమౌళికి దక్కుతున్న అంతర్జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ పురస్కారాలు నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ స్పందించడం జరిగింది.
ప్రభాస్ తెలియజేస్తూ రాజమౌళి ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడం మనందరికీ గర్వకారణం అంటూ తెలియజేశారు. అయితే తన గురించి ప్రభాస్ తెలియజేసిన తర్వాత రాజమౌళి తనదైన స్టైల్ లో స్పందించారు. “నన్ను నేను కూడా నమ్మని సమయంలో నువ్వు నమ్మావు నాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని నువ్వు చెబుతుంటే నేను నమ్మలేదు కానీ.. నన్ను నువ్వు నమ్మావు అంటూ రాజమౌళి తెలియజేశారు”. RRR సినిమాతో ఆస్కార్ రేస్ లో నిలిచేందుకు పోటీపడుతున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు అందుకున్నాయి.
ఆర్ఆర్అర్ చిత్రానికి సంబంధించి రాజమౌళి టీమ్ లో పలు విభాగాలలో ఈ అవార్డులు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి షేర్ చేసిన ఈ కామెంట్లు కాస్త వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని హీరో మహేష్ బాబుతో కలిసి తెరకెక్కించబోతున్నారు. అందుకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నట్లు రాజమౌళి తండ్రి తెలియజేయడం జరిగింది. ఇక ప్రభాస్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
That's #Prabhas for you! 🥺❤️ pic.twitter.com/7ZFaO8LQcH
— Mental Rebel GOD 🗿 (@charanvicky_) December 13, 2022