ఇప్పుడు ఎక్కడ విన్నా ఆహా OTTలో ప్రసరితమౌతున్న ‘అన్ స్టాపబుల్ షో’ గురించే వినబడుతోంది. దానికి కారణం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అవును, బాలయ్య ఏ ముహూర్తాన ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడో అప్పటినుండి ఆహా OTTకి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. బాలయ్య తనదైన కామెడీ టైమింగ్ తో వెండితెరమీదే కాకుండా బుల్లితెరపై కూడా విజృంభిస్తున్నాడు. అదంతా పక్కన బెడితే తాజాగా ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అతని స్నేహితుడు, హీరో అయినటువంటి గోపీచంద్ వచ్చారట.
ఈ విషయం బయటపడ్డప్పటినుండి రెబల్ ఫ్యాన్స్ మంచి ఖుషిగా వున్నారు. దాంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య-ప్రభాస్ కాంబో ఎపిసోడ్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం ట్రేడ్ పండితులు అంటున్నారు. బేసిగ్గా ప్రభాస్ టాక్ షోలంటే అంత ఇంటరెస్ట్ చూపడు. ఆయన తన సినిమా ప్రమోషన్స్ అప్పుడు మాత్రమే బయట కనిపిస్తారు. అలాగే సోషల్ మీడియా అసలు వాడరు. కాబట్టి అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్ హాజరుకావడం గొప్ప విషయం ఇపుడు అందరూ అనుకుంటున్నారు. ఆ క్రెడిట్ అంతా బాలయ్యకే ఇచ్చేస్తున్నారు.
అసలు విషయానికొస్తే ఈ షోలో ప్రభాస్ ధరించిన షర్ట్ ధర ఇప్పుడు వార్తలకు ఎక్కింది. అన్ స్టాపబుల్ షో కోసం ప్రభాస్ యెల్లో, గ్రీన్ కాంబినేషన్ కలిగిన మల్టీ కలర్ షర్ట్ ధరించిన విషయం మీకు తెలిసినదే. కాగా ఈ షర్ట్ నెటిజెన్స్ కి బాగా నచ్చింది. దీంతో ఆ షర్ట్ ని గూగుల్ చేయగా దాని ధర వివరాలు బయటపడ్డాయి. ప్రభాస్ ధరించిన ఆ షర్ట్ పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మడ్రాస్ బటన్ డౌన్ షర్ట్. దీని ధర £ 115. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 11,618. దాంతో నెటిజన్లు ఒక సామాన్యుడు ఆ డబ్బుతో ఏడాదికి సరిపడా బట్టలు కొనుక్కోవచ్చు అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.